మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యత : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,నవంబర్18 నషాముక్త్ భారత్ అభియాన్‌కు ఐదేళ్లు – జిల్లాలో విస్తృత అవగాహన కార్యక్రమాలు జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో, ముఖ్యంగా యువతలో అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషాముక్త్ భారత్ అభియాన్ ఐదేళ్లు పూర్తై సందర్భంగా, నల్లగొండ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యాసంస్థల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచనల మేరకు, పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాఠశాలలు–కళాశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలు శారీరక, మానసిక, సామాజికంగా ఎలా దెబ్బతీస్తాయో, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టపరమైన శిక్షాంశాలు వంటి కీలక అంశాలను అధికారులు వివరించారు....