పల్నాటి వీరారాధన ఉత్సవాలు నూతనోత్తేజంతో రేపు ప్రారంభం మహాభారతాన్ని తలపించే పల్నాటి యుద్ధ ఘట్టాల స్మరణ
డైనమిక్ న్యూస్, నవంబర్ 18, కారంపూడి పల్నాటి సీమ పౌరుషానికి ప్రతీక. ఒకప్పటి రణక్షేత్రమైన కార్యమపూడి—ప్రస్తుతం కారంపూడి—మళ్లీ వీరచార ఉత్సవాల సందడి కోసం సిద్దమవుతోంది. కార్తీక పౌర్ణమి నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు రేపు బుదవారం ఈ నెల 19 నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. కారంపూడి—రణభూమిని గుర్తు చేసే క్షేత్రం 11వ శతాబ్దంలో కారంపూడి నాగులేరు ఒడ్డున జరిగిన పల్నాటి యుద్ధం చరిత్రలో నిలిచిపోయిన ఘట్టం. ఆ యుద్ధంలో అమరులైన వీరులను స్మరించేందుకు స్థానికులు నిర్మించిన వీరుల దేవాలయం నేటికీ ఆ మహోన్నత గాధను స్మరింపజేస్తోంది. ఈ దేవాలయంలో జరిగే ఉత్సవాల నిర్వహణ బాధ్యత పిడుగు వంశానికి అప్పగించినట్లు...