నరసరావుపేటలో రూ.85 లక్షలతో తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
డైనమిక్ న్యూస్, నరసరావుపేట, నవంబర్18 నియోజకవర్గంలో అభివృద్ధి వేగవంతం నరసరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఊపందుకున్నాయని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు. ఉప్పలపాడు ఎన్టీఆర్ కాలనీకి వెళ్లే మెయిన్ రోడ్డును ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రూ.85 లక్షల వ్యయంతో తారు రోడ్డుగా నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినుకొండ రోడ్డులో ఘనంగా శంకుస్థాపన మంగళవారం వినుకొండ రోడ్డులోని ఉప్పలపాడు ఎన్టీఆర్ కాలనీ లేఅవుట్‌కు వెళ్లే తారు రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు మాట్లాడుతూ,“ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అభివృద్ధి ఆకాంక్షలను తీర్చడానికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఎన్టీఆర్ కాలనీ వాసుల...