వైకుంఠ ద్వార దర్శనం సాధారణ భక్తులకు – హర్షనీయ నిర్ణయం : ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ

డైనమిక్ న్యూస్,వినుకొండ, నవంబర్ 18 తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా సాధారణ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టిటిడి తీసుకున్న కీలక నిర్ణయం హర్షనీయమని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు పది రోజులపాటు భక్తులకు ప్రత్యేక దర్శనావకాశం కల్పించడం అనేది సామాన్య భక్తులకు పెద్ద వరమని జీవీ అభిప్రాయపడ్డారు. మొత్తం 182 గంటల దర్శన సమయాన్ని నిర్ణయించగా… అందులో 104 గంటలను పూర్తిగా సాధారణ...