దాతలు ముందుకొస్తే పేదరికం దరిచేరదు : ఎమ్మెల్యే జూలకంటి యాగంటి బాలకృష్ణ, నరేష్ సేవలు స్పూర్తిదాయకం పీ–4 బంగారు కుటుంబం ద్వారా విద్యార్థికి దత్తత

డైనమిక్ న్యూస్,వెల్దుర్తి, నవంబర్ 18 దుర్గి మండలం అడిగొప్పల గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ యాగంటి బాలకృష్ణ, మండల టీడీపీ యువ నాయకులు యాగంటి నరేష్ సేవలు ఆదర్శప్రాయమని శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అభినందించారు. విద్యార్థి ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం అడిగొప్పల గ్రామానికి చెందిన మాశెట్టి భాస్కరరావు అనే విద్యార్థి ఉన్నత విద్య కోసం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను తెలుసుకున్న బాలకృష్ణ, నరేష్ ముందుకు వచ్చి సహాయం అందించారు. పీ–4 బంగారు కుటుంబం ద్వారా విద్యార్థిని దత్తత తీసుకోవడం ద్వారా భాస్కరరావు చదువు బాధ్యతను స్వీకరించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేత బుధవారం వెల్దుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసన సభ్యుల...