సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ధూళిపాళ ధనుంజయ నాయుడుసిపిఐ వందవ వార్షికోత్సవాలకు నేరేడుచర్లలో విస్తృత ప్రచారం

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, నవంబర్ 18 సిపిఐ పార్టీ వందవ వార్షికోత్సవాలు మరియు ఈ నెల జరుగనున్న ప్రచార జాతాకు సంబంధించి నేరేడుచర్లలో విస్తృత ప్రచారం చేపడుతున్నట్లు సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ధూళిపాళ ధనుంజయ నాయుడు తెలిపారు. మంగళవారం వాల్ రైటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులను ఆయన ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి గ్రామంలో పార్టీ లక్ష్యాల ప్రచారం అవసరం కరపత్రాలు, వాల్ రైటింగ్, కళారూపాలు వంటి పద్ధతుల ద్వారా గ్రామాలు, మారుమూల పల్లెలు, గిరిజన తండాల్లో సిపిఐ 100వ వార్షికోత్సవ సభల ఉద్దేశం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.పార్టీ నేతలు చేసిన త్యాగాలను యువతకు వివరించి, వారిని ప్రజాసంఘాల్లో సభ్యులుగా...