కూకట్‌పల్లి ఖైతాలపూర్ మైదానంలో క్షత్రియ సేవా సమితి ఆత్మీయ కార్తీక వనభోజన మహోత్సవం

హైదరాబాద్, డైనమిక్ న్యూస్, నవంబర్ 17 ఉసిరి పూజతో ప్రారంభమైన కార్తీక మాస వేడుకలు క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఖైతాలపూర్ మైదానంలో వనభోజన మహోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో క్షత్రియ కుటుంబాలు హాజరై సంతోషంగా గడిపారు. కార్తీక మాస విశిష్టతను చాటిచెప్పుతూ ముందుగా ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అల్లూరి సీతారామరాజుకు ఘనంగా నివాళులు అర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారులకు ఆటల పోటీలు ఆకట్టుకున్నాయి వనభోజన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, సాంప్రదాయ నృత్యాలు, పాటలు హాజరైన వారిని అలరించాయి.చిన్నారుల కోసం ప్రత్యేక ఆటల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు...