గుంటూరు ఈపీఎఫ్ కార్యాలయంలో పెన్షనర్ల వినతులు స్వీకరణ ఏపీఆర్‌పీఎ జిల్లా కమిటీ ప్రతినిధుల భేటీ
డైనమిక్ న్యూస్,గుంటూరు, నవంబర్ 17 గుంటూరు కృష్ణనగర్‌లోని ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) కార్యాలయంలో సోమవారం ఉదయం ఏపీఆర్‌పీఎ గుంటూరు జిల్లా కమిటీ ప్రతినిధులు బాధ్యతల్లో ఉన్న అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాలనాపర అంశాలపై స్పష్టమైన చర్చలు జరిపారు. కేంద్ర కార్యాలయానికి వినతుల పంపిణీ ఈ సందర్భంగా ఈపీఎఫ్ ప్రాంతీయ కమిషనర్–1 శ్రీ ప్రభుదత్త ప్రజ్ఞాపురుష గారిని ప్రతినిధులు కలిసి వివిధ సమస్యలను వివరించారు. పాలనా సంబంధిత అంశాలను కేంద్ర కార్యాలయానికి పంపించి పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. స్థానిక సమస్యల పరిష్కారానికి భరోసా తమ కార్యాలయ పరిధిలో ఉన్న అంశాలను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకుంటామని ప్రాంతీయ కమిషనర్–1 హామీ...