బంగ్లాదేశ్‌లో సంచలన తీర్పు మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు

ఢాకా, డైనమిక్ న్యూస్ డెస్క్, నవంబర్17 బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT-1) సోమవారం ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఆందోళన కారులపై ప్రాణాంతక చర్యలకు ఆమె బాధ్యత వహించాల్సిందేనని కోర్టు పేర్కొంది. “ఆమె చేతులు రక్తంతో తడిచాయి” — ట్రైబ్యునల్ కఠిన వ్యాఖ్యలు ఆందోళనల సమయంలో భద్రతాదళాలకు “గట్టిగా చంపేయండి” అన్నట్లుగా ఆదేశాలు జారీ చేశారని తీర్పులో పేర్కొంది.ప్రజాస్వామ్య హక్కులు కోల్పోయిన యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసిన హింసాత్మక చర్యల్లో ఆమె పాలుపంచుకున్నట్టు ట్రైబ్యునల్ అభిప్రాయపడింది.“మానవత్వాన్ని మరిచిన నాయకురాలు” అని వ్యాఖ్యానిస్తూ కోర్టు తీర్పు తీవ్రమైంది. ప్రస్యూకుషన్...