చలిలో ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి ప్రజల భద్రతే మా ప్రధాన లక్ష్యం : సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 17 శీతాకాలం ప్రభావంతో జిల్లాలో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రహదారులపై ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకుని ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జిల్లా ఎస్పీ కె.నరసింహ వెల్లడించారు. ఈ సందర్భంలో వాహనదారులు తప్పనిసరిగా రోడ్లపై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ పొగమంచు—ప్రమాదాలకు కారణం,ఉదయం సమయంలో మంచు, పొగమంచు కురవడంతో విజిబిలిటీ తగ్గి, ముందున్న వాహనాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు సంభవించే అవకాశముందని ఎస్పీ హెచ్చరించారు. కాబట్టి ఈ కాలంలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాహనదారులు పాటించాల్సిన కీలక సూచనలు వాహనదారులు లైటింగ్ కండిషన్ చెక్ చేసుకోవడం, తక్కువ...