నల్లగొండ జిల్లా ఎస్పీ పేరుతో ఫేక్ నకిలీ ఫేస్‌బుక్ ఖాతా అకౌంట్ సృష్టించిన సైబర్ మోసగాళ్లు, ఆ ఖాతా నుండి వచ్చే సందేశాలకు స్పందించ వద్దని ఎస్పీ హెచ్చరిక

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 16 నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేరు, ఫోటోను ఉపయోగించి గుర్తుతెలియని వ్యక్తులు ఒక నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఫేక్ ఖాతా నుండి ప్రజలకు మెసేజ్‌లు పంపిస్తూ డబ్బులు అడుగుతున్నట్లు నివేదికలు రావడంతో జిల్లా పోలీస్ వ్యవస్థ అప్రమత్తం అయ్యింది. “ఈ ఫేక్ ప్రొఫైల్ కు ప్రజలు ఎవరు కూడా స్పందించ వద్దు ఆదివారం  ఒక ప్రకటనలో తెలిపారు జిల్లా ప్రజలకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పష్టం చేస్తూ— “Sharath Chandra Pawar Ips (SP Nalgonda) అని కనిపించే ఫేస్‌బుక్ ఖాతా పూర్తిగా నకిలీది. నేను ఉపయోగించే...