ప్రమాదంలో ప్రాణాలు పోవాల్సిన శివ… యువకుల సాహసంతో కాపాడబడి బతికి బయల్పడ్డ ఘటననల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో జరిగిన హృదయ విదారక సంఘటన
డైనమిక్ న్యూస్,త్రిపురారం, నవంబర్ 16 నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవలపల్లి గ్రామ సమీపంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్ద ఆదివారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. కాలువ ఒడ్డున నడుస్తూ ప్రమాదవశాత్తు కాలుజారి మిర్యాలగూడ కు చెందిన శివ అనే వ్యక్తి లోతైన ప్రవాహంలో పడిపోవడం స్థానికుల్లో ఆందోళన రేపింది.ప్రవాహం తీవ్రమై ఉండడంతో శివ నీటిలో కొట్టుకుని పోతాడేమో అన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఆ సమయానికి ఆ దారిలో వెళ్తున్న పెద్దదేవలపల్లి గ్రామానికి చెందిన యువకులు మేకల సతీష్ తన స్నేహితులతో కలిసి పరిస్థితిని గమనించారు. ఒక్క క్షణం ఆలస్యం చేస్తే ప్రాణ నష్టమవుతుందని గ్రహించిన సతీష్ ప్రమాదాన్ని లెక్కచేయకుండా నీటిలోకి దూకి శివను పట్టుకొని...