లాటరీల పేరుతో ఆర్థిక మోసాలు చేస్తే కఠిన చర్యలు: సూర్యాపేట ఎస్పీ నరసింహ హెచ్చరిక

సూర్యాపేట బ్యూరో, నవంబర్ 16, డైనమిక్ న్యూస్ సూర్యాపేట జిల్లాలో స్థిరాస్తి లాటరీల పేరుతో జరుగుతున్న ఆర్థిక మోసాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం స్పష్టం చేశారు. ప్రజల కష్టార్జితమైన డబ్బును లక్ష్యంగా చేసుకుని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరియు వ్యక్తులు కలిసి మోసపూరిత పద్ధతుల్లో లాటరీలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడిందన్నారు. “1000 కట్టు–ఫ్లాటుపట్టు” పేరుతో మోసాలు పెరుగుదల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో “1000 కట్టు–ఫ్లాటుపట్టు” వంటి బానర్లతో ప్రజల్లో ఆశలు రెచ్చగొట్టేలా లాటరీలు నిర్వహిస్తున్నారని ఎస్పీ తెలిపారు. భూములు, ఫ్లాట్లు, ప్లాట్ల పేరుతో లాటరీలు నిర్వహించడం పూర్తిగా చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు.ఇటువంటి పథకాలు...