పని ‘హక్కు’ కాదన్న కేంద్ర విధానం పై ఆందోళనలు పని హక్కు — జీవనోపాధికి పునాది
డైనమిక్ న్యూస్ డెస్క్, డిల్లీ, నవంబర్ 16 పని చేసే హక్కు మనిషి గౌరవానికి, జీవనోపాధికి అత్యంత కీలకమైన ప్రాథమిక హక్కు గా పరిగణించబడుతుంది. సమాన పనికి సమాన వేతనం, నిష్పక్షపాత పనిగంటలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ హామీ పథకాల వంటి హక్కులు ఇప్పటి వరకూ శ్రామికులకు చట్టబద్ధంగా అందుతున్నాయి. 1948 ఐరాస మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో కూడా పనిని ప్రాథమిక హక్కుగా గుర్తించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 41లు కూడా జీవించే హక్కుతో పాటు పనిచేసే హక్కుకు మద్దతు ఇస్తాయి. కొత్త జాతీయ కార్మిక విధానం పై వివాదం కేంద్ర ప్రభుత్వం త్వరలో అమలు చేసేందుకు సిద్ధం చేసిన ‘జాతీయ కార్మిక...