కారంపూడి పల్నాటి ఉత్సవాలకు కలెక్టర్, ఎస్పీకి పీఠాధిపతి ఆహ్వానం
కారం పూడి, డైనమిక్, నవంబర్ 15 కారంపూడి పల్నాటి చారిత్రక ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, జిల్లా ఎస్పీ కృష్ణరావులను పల్నాడు పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ్ శనివారం నరసరావుపేటలో మర్యాద పూర్వకంగా కలుసుకొని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పీఠం నిర్వాహకులు బొగ్గరం విజయ్‌కుమార్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. అధికారులకు ఆహ్వాన పత్రాల అందజేత పీఠాధిపతితో కలిసి కారంపూడి తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్, ఎంపీడిఓ శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శి కాసిన్య నాయక్, గ్రామపెద్దలు కలెక్టర్, ఎస్పీలకు ఉత్సవాల ఆహ్వానపత్రాలు అందజేశారు. ఉత్సవాల తేదీలు – కార్యక్రమాలు పల్నాటి ఉత్సవాలు ఈ నెల 19 నుండి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు...