పరిశ్రమలకు ఏపీ స్వర్గధామంసీఎం చంద్రబాబు విజన్‌తో రాష్ట్ర భవిష్యత్తు బంగారుమయం
సీఐఐ సమ్మిట్‌లో కీలక ఒప్పందాలు 20 లక్షల ఉద్యోగాల దిశగా ప్రభుత్వం అడుగులు డైనమిక్ న్యూ, గుంటూరు, నవంబర్ 15 గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అహమ్మద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పరిశ్రమల పెట్టుబడులకు ‘స్వర్గధామం’గా మారిందని అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సుకు హాజరైన అనంతరం శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. సమ్మిట్‌తో ఏపీకి బంగారు భవిష్యత్తు సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆర్థిక అగ్రరాజ్యాల దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నదని ఎమ్మెల్యే నసీర్ పేర్కొన్నారు. రెండురోజుల కాలంలో అంతర్జాతీయ–జాతీయ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా...