ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు ఘనంగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, కలెక్టర్ కృతిక శుక్లా పాల్గోలు
డైనమిక్ న్యూస్,నరసరావుపేట,నవంబర్15 నరసరావుపేట మండలం పెద్ద తురకపాలెం గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి జన్ జాతీయ గౌరవ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రెసిడెన్షియల్ స్కూల్‌ను పరిశీలించిన ప్రజా ప్రతినిధులు పిల్లలు శుభ్రత పాటించే విధానాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రత్యక్షంగా చూపిస్తూ చేతులు ఎలా కడుకోవాలో సూచనలు ఇచ్చారు. విద్యార్థులతో సంభాషించి వారి చదువు, వసతి, ఆరోగ్య సంబంధ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బిర్సా ముండా పోరాటం...