20న చేనేత కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా విజయవంతం చేయండి– చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ పిలుపు
నల్గొండ బ్యూరో, నవంబర్ 15 , డైనమిక్ చేనేత కార్మికులకు తక్షణ రుణమాఫీ చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా చేనేత భరోసా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, నవంబర్ 20న హైదరాబాద్ నాంపల్లి చేనేత కమిషనర్ కార్యాలయం ముందుకు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ పిలుపునిచ్చారు. నర్సింగ్‌బట్లలో ప్రచారం – కరపత్రాల పంపిణీ శనివారం నల్గొండ మండలం నర్సింగ్‌బట్ల గ్రామపంచాయతీ పరిధిలోని చేనేత సహకార సంఘం అధ్యక్షుడు జేల్లా నర్సింహతో పాటు సభ్యులను కలుసుకుని ధర్నా విజయవంతం కోసం మురళీధర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేశారు....