డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ఈ నెలాఖరునాటికి పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ బ్యూరో,డైనమిక్, నవంబర్ 15 జిల్లాలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు ఆదేశించారు. గృహనిర్మాణ శాఖ పీడీ, ఆర్డీవోలు, తహసిల్దార్లతో ఆమె శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన ఇళ్లను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పూర్తిగా పారదర్శకంగా పంపిణీ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. బుధవారం నాటికి లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయాలని, లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నచోట శుక్రవారం లాటరీ విధానంలో ఎంపిక చేయాలని సూచించారు. శనివారం నాటికి ప్రొసీడింగ్స్ సిద్ధం ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీకి అవసరమైన ప్రొసీడింగ్స్‌ను...