నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ తనిఖీకమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ నరసింహ
డైనమిక్,నేరేడుచర్ల, నవంబర్ 14 జిల్లాలో పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ముందుగా సిబ్బంది గౌరవ వందనంతో స్వాగతం పలికారు. స్టేషన్ ప్రాంగణం, రికార్డులు, పరికరాలను పరిశీలించి సిబ్బంది క్రమశిక్షణపై అభినందనలు తెలిపారు. సమస్యలు అడిగి తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు. సేఫ్ హుజూర్నగర్ సర్కిల్ ప్రాజెక్ట్ ప్రారంభం సీసీ కెమెరాలు జిల్లా కమాండ్ సెంటర్‌కు అనుసంధానం, నేరేడుచర్ల స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ ఈ సెంటర్‌ను జిల్లా కేంద్రంతో అనుసంధా నించామని హుజూర్నగర్, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకవీడు, మఠంపల్లి ప్రాంతాల్లో...