రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి — కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట బ్యూరో, డైనమిక్, నవంబర్ 13 సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు .జిల్లాలో రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రమాదాలు జరగకుండా ప్రతి శాఖ సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.గురువారం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ కే. నరసింహతో కలిసి జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలి కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా రోడ్ల లోపం, భద్రతా ప్రమాణాల లోపం వల్లనే జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ అధికారులు వారం రోజుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి గుంటలు పూడ్చి, కాంక్రీట్...