సర్దార్ వల్లభాయ్ పటేల్ నేటి యువతకు స్పూర్తి– జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్
డైనమిక్, బాపట్ల,నవంబర్ 13 సర్దార్ వల్లభాయ్ పటేల్ త్యాగాలు, నాయకత్వం నేటి యువతకు ప్రేరణగా నిలవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం ఉదయం బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాల నుండి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ఐక్యాతా ర్యాలీకి ఆయన జెండా ఊపి ప్రారంభం చేశారు. దేశ సమైక్యతకు పటేల్ కృషి మరువలేనిది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,"ముక్కల ముక్కలుగా ఉన్న దేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్" అని పేర్కొన్నారు. భారతదేశపు “ఉక్కు మనిషి”గా పేరుపొందిన పటేల్, స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర...