పేదవారి సొంటింటి కల నెరవేర్చాలి – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు

సూర్యాపేట బ్యూరో, డైనమిక్, నవంబర్ 13 పేదలకు గృహ సదుపాయం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రామస్వామిగుట్ట వద్ద జరుగుతున్న సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను గురువారం ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఇందిరమ్మ కాలనీలో నిర్మాణ పనులు పరిశీలన కలెక్టర్ ఇందిరమ్మ కాలనీని సందర్శించి గృహాలు, రోడ్లు, నీటి సంపులు, సెప్టిక్ ట్యాంకులు, విద్యుత్‌ సరఫరా వంటి పనులను పరిశీలించారు. నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏటీసీ సెంటర్‌లో విద్యార్థులతో కలెక్టర్...