హెచ్-1బీ వీసాలు ఇక అమెరికన్లకోసమే!ట్రంప్ సర్కార్‌ సరికొత్త ఆలోచన – విదేశీ నిపుణులు శిక్షణ ఇచ్చి తిరిగి వెళ్లే విధానం

వాషింగ్టన్‌, డైనమిక్ డెస్క్, నవంబర్ 13 అమెరికాలో అత్యంత కీలకమైన హెచ్-1బీ వీసా విధానంపై ట్రంప్‌ ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని రూపొందిస్తోంది. ఇకపై విదేశీ నిపుణులను అమెరికాలో దీర్ఘకాలిక ఉద్యోగాల కోసం కాకుండా, అమెరికన్‌ కార్మికులకు అత్యున్నత నైపుణ్యాలు నేర్పించేందుకు తాత్కాలికంగా మాత్రమే అనుమతించనున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెస్సెంట్‌ వెల్లడించారు. విదేశీ నిపుణుల రాక – అమెరికన్లకు శిక్షణ కోసం మాత్రమే ఫాక్స్‌ న్యూస్‌తో మాట్లాడుతూ బెస్సెంట్‌, “ఇది కేవలం నాలెడ్జ్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్రక్రియ. గత కొన్ని దశాబ్దాలుగా ఇతర దేశాలకు తరలిపోయిన తయారీ రంగాన్ని తిరిగి అమెరికాలోనే బలోపేతం చేయడమే లక్ష్యం” అని చెప్పారు.“గత 20–30 ఏళ్లుగా మనం అత్యంత కచ్చితత్వంతో...