పేట సన్నెగండ్లలో కార్డెన్ సెర్చ్ — 33 వాహనాలు స్వాధీనం స్థానిక ఎన్నికల ముందు కాంప్లికేట్ గ్రామంలో భారీ పోలీస్ ఆపరేషన్,పల్నాడు ఎస్పీ ఆదేశాలపై గురజాల డీఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో తనిఖీలు

కారంపూడి, నవంబర్ 13, డైనమిక్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలు బలోపేతం చేయడం లక్ష్యంగా కారం పూడి మండలంలోని పేట సన్నెగండ్ల గ్రామంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు విస్తృతంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ గ్రామం రాజకీయంగా సున్నితమైన ("కాంప్లికేట్") ప్రాంతంగా గుర్తించబడటంతో, పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురజాల డీఎస్పీ శ్రీ జగదీష్  స్థానిక ఎస్ ఐ వాసు తో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు. 33 వాహనాలు స్వాధీనం — అనుమానాస్పద వ్యక్తుల పరిశీలన ఆపరేషన్‌లో పోలీసులు 33 మోటార్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ల లైసెన్సులు, వాహన పత్రాలు పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను గుర్తించి,...