దుర్గి, కారంపూడి మండలాల్లో నేడు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పర్యటన అన్నదాన భవనం శంకుస్థాపన, వ్యవసాయ డోన్‌ల ప్రారంభం, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శ్రీకారం
కారం పూడి, డైనమిక్, నవంబర్ 13 మాచర్ల నియోజకవర్గ శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి నేడు (గురువారం, 13 నవంబర్ 2025) దుర్గి మరియు కారంపూడి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దుర్గిలో అన్నదాన భవనం శంకుస్థాపన ఉదయం 11.30 గంటలకు, దుర్గి మండల కేంద్రంలోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపం వద్ద నిర్మించనున్న అన్నదాన భవనంకు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. కారంపూడిలో వ్యవసాయ డోన్‌ల ప్రారంభం మధ్యాహ్నం 12.00 గంటలకు, కారంపూడి మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన వ్యవసాయ డోన్‌లను ప్రారంభించనున్నారు. ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన తదుపరి మధ్యాహ్నం 12.30 గంటలకు,...