గ్రామపంచాయతీ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలి ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి సరైన పరిహారం ఇవ్వాలంటూ రొండి శ్రీనివాస్ డిమాండ్
మాడుగులపల్లి, నవంబర్ 13 (డైనమిక్ ప్రతినిధి) గ్రామపంచాయతీ కార్మికులు గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్నప్పటికీ, ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలు ప్రభుత్వ సహాయం లేక వేదనను అనుభ విస్తున్నాయని గౌరవాధ్యక్షులు రొండి శ్రీనివాస్ అన్నారు. మాడుగుల పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామపంచాయతీ కార్మికుల మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ — ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఎటువంటి అండలేదు ఇప్పటికీ పలు కారణాలతో గ్రామపంచాయతీల్లో పనిచేస్తూ అనేక మంది కార్మికులు ప్రమాదవశాత్తు మరణించారని, కానీ వారి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక సహాయం అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.“ప్రభుత్వం పథకాల గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉండటమే తప్ప,...