మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి– ఎంపీడీఓ వంశీధర్ మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఘన సన్మానం

డైనమిక్, మాడుగులపల్లి , నవంబర్ 13 మాడుగులపల్లి మండలంలోని మహిళలు అన్ని రంగాలలో ముందుండి, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అవకాశాలను వినియోగించుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని మండల ఎంపీడీఓ వంశీధర్ పిలుపునిచ్చారు.బుధవారం మండల కేంద్రంలోని మహిళా సమైక్య కార్యాలయంలో నిర్వహించిన వివోఏల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో నూతన మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా బాధ్యతలు చేపట్టిన వంశీధర్‌ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి ఎంపీడీఓ వంశీధర్ మాట్లాడుతూ –“మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. బ్యాంకుల సహకారంతో స్వయం ఉపాధి పథకాల...