పాలకీడు మండల అభివృద్ధే లక్ష్యం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీటీ రోడ్లు, సబ్‌స్టేషన్ నిర్మాణాలకు శంకుస్థాపన
సూర్యాపేట బ్యూరో, నవంబర్ 12 డైనమిక్ పాలకీడు మండలాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నానని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.బుధవారం ఆయన పాలకీడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం పాలకవీడు మండలంలోని మూసి ఒడ్డు సింగారంలో రూ.1.08 కోట్లతో మూసి ఒడ్డు సింగారం నుండి రోళ్ల వారి గూడెం వరకు బీటీ రోడ్డు,యల్లాపురంలో రూ.3.02 కోట్లతో 33/11 కెవి సబ్‌స్టేషన్ నిర్మాణం, బెట్టే తండాలో రూ.3.50 కోట్లతో బెట్టెతండా నుండి శూన్య పహాడ్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన...