ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు రైతులు ప్రైవేట్‌లో అమ్మవద్దు – మద్దతు ధరతో పాటు బోనస్ పొందండి
నల్గొండ బ్యూరో, నవంబర్ 12 , డైనమిక్ ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సూచించారు. తుఫాన్ కారణంగా కొంత ఆలస్యం జరిగినప్పటికీ, ఇప్పుడు కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రైతులు తొందరపడి ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. చర్లపల్లి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి బుధవారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని చర్లపల్లి వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు.ధాన్యం తేమశాతం, నిల్వ విధానం, రైతులు తెచ్చిన ధాన్యం వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా రైతులతో, హమాలీలతో, కేంద్ర నిర్వాహకులతో...