గరిడేపల్లి మండలంలో అభివృద్ధి శంకుస్థాపనలు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట బ్యూరో, నవంబర్ 12, డైనమిక్ ప్రజల మేలు కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గరిడేపల్లి మండలంలోని పలు రోడ్ల నిర్మాణాలకు ఆయన బుధవారం శంకుస్థాపనలు చేశారు. పేదల కోసం సంక్షేమ పథకాల అమలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ –“ప్రజా ప్రభుత్వం పేదవారి కడుపు నిండా తినేలా సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. అర్హత ఉన్న వారికి నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నాం. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ అందజేస్తున్నాం. త్వరలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయబోతున్నాం” అని...