అన్నదాతలకు అండగా ప్రభుత్వం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ – రైతులకు భరోసా
సూర్యాపేట బ్యూరో, డైనమిక్,నవంబర్12 సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలో బుధవారం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ధాన్యం తేమ శాతం, కొలతలు, కొనుగోలు విధానాన్ని స్వయంగా పరిశీలించి అన్నదాతలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఒకే సీజన్‌లో 150 లక్షల మెట్రిక్ టన్నుల పంట – చరిత్ర సృష్టించిన తెలంగాణ స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక్క సీజన్‌లో 150 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు.ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.25 వేల కోట్లతో...