ఉచిత చేప పిల్లల పంపిణీ విజయవంతం చేయాలి – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట బ్యూరో, డైనమిక్, నవంబర్ 12 తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులు, సొసైటీ సభ్యులకు సూచించారు.బుదవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో పంచాయతీ రాజ్, ఇరిగేషన్, వ్యవసాయ, మత్స్యశాఖ అధికారులు మరియు సొసైటీ సభ్యులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మత్స్యశాఖ ద్వారా చేప పిల్లల పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. 4.40 కోట్ల రూపాయల వ్యయంతో చేప పిల్లల పంపిణీ కలెక్టర్ వివరించిన ప్రకారం— పులిచింతల, యాతవాకిళ్ల రిజర్వాయర్లకు 37.99 లక్షల పెద్ద చేప పిల్లలు,186 శాశ్వత...