సూర్యాపేట పోలీసుల సత్తా — ఖరీదైన బైకుల దొంగల అరెస్ట్,రూ.20 లక్షల విలువైన 26 బైకులు స్వాధీనం,“నేరస్తులెవరూ శిక్ష నుండి తప్పించుకోలేరు” – ఎస్పీ కె.నరసింహ
సూర్యాపేట బ్యూరో, నవంబర్ 12 (డైనమిక్ న్యూస్) సూర్యాపేట టుటౌన్ పోలీసులు మరోసారి తమ నేరచేదన నైపుణ్యాన్ని చాటారు. ఖరీదైన ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పట్టుకుని, రూ.20 లక్షల విలువైన 26 బైకులను స్వాధీనం చేసుకున్నారు.బుదవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కె.నరసింహ వెల్లడించారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ “నేరాలకు పాల్పడితే ఎవ్వరూ తప్పించుకోలేరు.చట్టాన్ని గౌరవించాలి, నేరం చేసిన వారెవరైనా జైలు శిక్ష తప్పదు. ప్రజలు చట్టానికి లోబడి ఉండాలి,” అని ఎస్పీ పౌరులకు సూచించారు నిందితుల వివరాలు A1: వేమూరి కృష్ణ (57), తండ్రి రామయ్య, కట్టకొమ్ముగూడెం గ్రామం, చిలుకూరు...