ధాన్యం కొనుగోలు, విద్యా తనిఖీలపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మిక పర్యటనలు సరైన తేమశాతంతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి – కలెక్టర్ ఆదేశాలు“పదవ తరగతి భవిష్యత్తుకు తొలి మెట్టు” – విద్యార్థులకు కలెక్టర్ సూచనలు
సూర్యాపేట బ్యూరో, నవంబర్ 11 (డైనమిక్ న్యూస్) జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మంగళవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తేమశాతం సరైన ధాన్యాన్ని ఆలస్యం చేయకండి తిరుమలగిరి మండలంలోని తొండ, కోక్యానాయక్ తాండా, ఫణిగిరి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ముందుగా తొండలో ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సందర్శించి ట్యాగింగ్ చేసిన మిల్లులు, ధాన్యం తేమశాతం వివరాలను పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని ముందుగా ఆరబెట్టిన తర్వాత పంపాలని, అయితే తేమశాతం సరైన స్థాయిలో ఉంటే వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు...