ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుక

హుజూర్‌నగర్, నవంబర్ 11, డైనమిక్ న్యూస్ హుజూర్‌నగర్ పట్టణంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యా వ్యవస్థకు పునాది వేసిన మహనీయుడు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రెహనా మాట్లాడుతూ, దేశ విద్యా వ్యవస్థకు పునాదులు వేసిన సంస్కర్తగా మౌలానా అజాద్ చేసిన సేవలు అపూర్వమని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలి విద్యాశాఖ మంత్రిగా ఆయన విద్యా, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి చేసిన కృషి విశిష్టమని ఆమె గుర్తు చేశారు. సమానత్వం, సహనం, ఐక్యత – మౌలానా అజాద్ బోధనలు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ,...