సూర్యాపేట జిల్లాలో పకడ్బందీగా భద్రతా తనిఖీలు డిల్లీ పేలుళ్ల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం

సూర్యాపేట బ్యూరో, నవంబర్ 11, డైనమిక్ డిల్లీలో సోమవారం జరిగిన బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ హైఅలర్ట్‌ లోకి మారింది. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో విస్తృత భద్రతా తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్లలో కమ్మిన పోలీసు కవచం కొత్త బస్టాండ్, హైటెక్ బస్టాండ్ ప్రాంగణాలలో పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, స్పెషల్ పార్టీ సిబ్బందితో కలిసి ప్రతి మూలను జాగ్రత్తగా తనిఖీ చేశారు. బస్సులు, ప్రయాణికుల లగేజీ, దుకాణాలు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించారు. మాదకద్రవ్యాలు, నిషేధిత పదార్థాలపై నిఘా తనిఖీల ప్రధాన లక్ష్యం పట్టణంలో భద్రతా వాతావరణం నెలకొల్పడంతోపాటు డ్రగ్స్,...