ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో బోర్డర్ జిల్లా అంతటా హైఅలర్ట్ ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు ముమ్మర తనిఖీలు
అనంతపురం, నవంబర్ 11, డైనమిక్ న్యూస్ ఢిల్లీ పేలుళ్ల ఘటన అనంతరం అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. జిల్లా ఎస్పీ పి. జగదీష్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు భద్రతా ఏర్పాట్లు బలపరచడంతోపాటు అన్ని కీలక ప్రదేశాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. విస్తృత భద్రతా చర్యలు ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోలీసులు ఆలయాలు, రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లు, వాణిజ్య కేంద్రాలు, పార్కులు, రద్దీ ప్రదేశాల్లో క్షుణ్ణమైన తనిఖీలు చేపట్టారు. బాంబు నిర్వీణ దళం, శునక దళం సహకారంతో ప్రతి మూలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణలో తనిఖీలు హోంగార్డులు, కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, సీఐలు నుండి డీఎస్పీలు వరకు అందరూ తనిఖీలలో పాల్గొన్నారు. అనుమానాస్పద...