ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు
నల్గొండ బ్యూరో, నవంబర్ 10 ,డైనమిక్ జిల్లా ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేలా ప్రజావాణి కార్యక్రమంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వివిధ రకాల ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. అనంతరం ఆమె సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ ఫిర్యాదులు ఉంచొద్దు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, “ఫిర్యాదులు అందిన వెంటనే వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. అనవసరంగా పెండింగ్‌లో ఉంచొద్దు. పరిష్కారం కాని ఫిర్యాదు ఉంటే ఫిర్యాదుదారునికి స్పష్టమైన వివరణ ఇవ్వాలి....