వాహన రవాణా నియమాలు పాటించాలి – రోడ్డు భద్రతే ప్రాధాన్యం పరిమితికి మించి ప్రయాణికుల రవాణా నేరం – ఎస్పీ నరసింహ హెచ్చరిక గత వారం రోజుల్లో 70 వాహనాలపై కేసులు

సూర్యాపేట బ్యూరో, నవంబర్ 10,డైనమిక్ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ లక్ష్యంగా వాహనాలపై కఠిన తనిఖీలు కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం, గూడ్స్ వాహనాల్లో ప్రజలను రవాణా చేయడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి వాహనాలపై కేసులు నమోదు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. గూడ్స్ వాహనాల్లో ప్రజా రవాణా నిషేధం గూడ్స్ వాహనాలు సరుకుల రవాణా కోసం మాత్రమే అనుమతించబడ్డాయని, వాటిలో ప్రజలు, కూలీలు లేదా చిన్నపిల్లలను తరలించడం చట్ట విరుద్ధమని పోలీసులు హెచ్చరించారు. చిన్న పిల్లలను గూడ్స్ వాహనాల్లో ప్రయాణించడం వల్ల తీవ్ర ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, ప్రజలు తమ...