పల్నాటి వీర తిరునాళ్లకు కారం పూడిలో ఏర్పాట్లు జోరుగా ఎడ్ల బల ప్రదర్శన కర పత్రం ఆవిష్కరణ చేసిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంగులూరి అంజయ్య

కారం పూడి, నవంబర్ 9 (డైనమిక్) కారం పూడి మండలంలో ఈ నెల 19వ తేదీ నుండి ఐదు రోజుల పాటు జరగనున్న పల్నాటి వీర తిరునాళ్లు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల రైతులు, పశుపోషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఉత్సవాల్లో ముఖ్య ఆకర్షణగా నిలిచే ఎడ్ల బల ప్రదర్శనలు ఈసారి ఆరు విభాగాల్లో నిర్వహించనున్నారు. బల ప్రదర్శన కరపత్రం ఆవిష్కరణ ఆదివారం సాయంత్రం కారం పూడి ఆర్‌అండ్‌బి బంగ్లాలో జరిగిన సమావేశంలో ఎడ్ల బల ప్రదర్శన కరపత్రాన్ని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంగులూరి అంజయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పల్నాటి వీర తిరునాళ్లు రైతు...