ఘనంగా సరస్వతీ విద్యానిలయం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం17 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు – గురువులకు ఘన సన్మానం
సూర్యాపేట బ్యూరో, నవంబర్ 9 డైనమిక్ జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతీ విద్యానిలయంలో 2007–08 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఆదివారం ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 17 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ కలుసుకున్న స్నేహితులు పరస్పరం ఆప్యాయంగా పలకరించుకొని, నాటి మధుర జ్ఞాపకాలను స్మరించుకున్నారు. గురువులకు ఘన సన్మానం ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యతోనే వ్యక్తి అభివృద్ధి సాధ్యమని, తమ శిష్యులు నేడు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉండటం గర్వకారణమని తెలిపారు. జ్ఞాపకాలతో ఉప్పొంగిన మిత్రులు విద్యార్థులు ఒక్కొక్కరుగా మాట్లాడి తమ విద్యారంభ...