మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎదుర్కోవాలి సిఐటియు జిల్లా మహాసభలు 29, 30 తేదీల్లో నల్గొండలో 29న భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించనున్న సిఐటియు
నల్లగొండ బ్యూరో,డైనమిక్,నవంబర్9 నల్గొండ పట్టణంలో ఈ నెల 29, 30 తేదీల్లో జరగబోయే సిఐటియు (CITU) నల్గొండ జిల్లా 13వ మహాసభల సందర్భంగా, 29న భారీ కార్మిక ప్రదర్శనను విజయవంతం చేయాలని జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి. సలీం పిలుపునిచ్చారు.ఆదివారం నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవనంలో ఎగుమతి దిగుమతి అమాలి వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ —“మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం ఐక్యంగా తిరగబడాల్సిన అవసరం ఉంది. దేశంలోని 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ పేరుతో పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్పులు చేయడం పూర్తిగా కార్మిక వ్యతిరేక చర్య”...