స్పెషల్ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి రాజీయే రాజమార్గం – ఎస్పీ నరసింహ

సూర్యాపేట ,డైనమిక్, నవంబర్ 9 ఈ నెల 15 శనివారం నాడు జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా పోలీస్ అధికారి నరసింహ పిలుపునిచ్చారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ రాజీపడదగిన కేసుల్లో ఇరువర్గాల మధ్య పరస్పర అవగాహనతో పరిష్కారం కనుక్కోవడం వల్ల సమయం, ధనం, శ్రమ ఆదా అవుతుందని తెలిపారు. రాజీ ద్వారా అందరికీ న్యాయం త్వరగా లభిస్తుందని పేర్కొన్నారు. ఏయే కేసులు రాజీకి అనువో తెలుసుకోండి ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబ పరమైన విభేదాలు, మోటార్ వాహన నిబంధనల ఉల్లంఘన, డ్రంకన్ డ్రైవ్, విద్యుత్ చౌర్యం, బ్యాంకు...