నల్లగొండ జిల్లాలో న్యాయ సేవల దినోత్సవం ఘనంగా
నల్లగొండ బ్యూరో, డైనమిక్,నవంబర్9 నల్లగొండ జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నాడు న్యాయ సేవల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గౌరవ జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ (NALSA), రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ (TSLSA) ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రజలకు ఉచిత న్యాయ సహాయం – అవగాహనపై దృష్టి జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి పురుషోత్తం రావు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం సంస్థ ప్రధాన ధ్యేయమని అన్నారు. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు చట్టాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సంస్థ...