నేరేడుచర్లలో విషాద ఘటన – నీటిలో పడి బాలిక మృతిమూసీ ప్రవాహంలో మునిగిన బాలిక మృతదేహాన్ని స్వయంగా బయటకు తీసిన ఎస్సై రవీందర్ నాయక్‌

నేరేడుచర్ల డైనమిక్, నవంబర్9 సరదాగా మట్టి వినాయక విగ్రహాన్ని తయారు చేసి నిమజ్జనం చేయడానికి వెళ్లిన బాలిక దురదృష్టవశాత్తు నీటిలో పడి మృతి చెందిన విషాద ఘటన శనివారం నేరేడుచర్ల మండలం సోమవారం గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికుల సమాచారం మేరకు సోమవారం గ్రామానికి చెందిన కొమ్మరాజు సుస్మిత (13) అనే బాలిక, సోమవారం హైస్కూల్లో 8వ తరగతి విద్యార్థిని. శనివారం సెలవు కావడంతో ఇంట్లోనే మట్టి వినాయక విగ్రహాన్ని తయారు చేసింది. దానిని నిమజ్జనం చేయడానికి తన ఇద్దరు స్నేహితులతో కలిసి సోమప్ప దేవాలయం వెనుక భాగంలో ఉన్న మూసీ నది వద్దకు వెళ్లింది.అయితే నిమజ్జనం సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి గల్లంతయింది. సమాచారం అందుకున్న పోలీసులు,...