వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఆరోపణలు అసత్యం – కలెక్టర్ ఇలా త్రిపాఠివిద్యార్థులతో జిల్లా యంత్రాంగం సుదీర్ఘ చర్చ – స్నేహపూర్వక వాతావరణం ఉన్నట్లు నిర్ధారణ
నల్లగొండ బ్యూరో, డైనమిక్,నవంబర్7 నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్టు విద్యార్థుల నుండి జిల్లా యంత్రాంగానికి ఎలాంటి ఫిర్యాదు అందలేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.అయినప్పటికీ జాగ్రత్త చర్యగా విద్యార్థులతో, అధ్యాపకులతో, మెంటర్లతో సుదీర్ఘంగా చర్చించినట్లు ఆమె వెల్లడించారు.సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులతో స్నేహపూర్వక వాతావరణంలోనే మెలుగుతున్నారని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. కళాశాల సందర్శించిన జిల్లా అధికారులు వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగిందని కొన్ని మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,స్థానిక సంస్థల ఇన్‌ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్,నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డిలతో కలిసి శుక్రవారం ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు.కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ,...