మహిళా క్రికెటర్ చరణికి సీఎం చంద్రబాబు భారీ ప్రోత్సాహకం రూ.2.5 కోట్లు, 1000 చ.గ. స్థలం, గ్రూప్-1 ఉద్యోగం
అమరావతి, నవంబర్ 7 , డైనమిక్ మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా భారత్‌కు గౌరవం తీసుకువచ్చిన తెలుగమ్మాయి చరణి కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ ప్రోత్సాహకం ప్రకటించారు. క్రీడా రంగంలో ఆమె ప్రతిభకు సూచకంగా రూ. 2.5 కోట్ల నగదు బహుమతి, కడపలో 1000 చ.గ. స్థలాన్ని ఇల్లు నిర్మాణం కోసం కేటాయించడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని సీఎం ప్రకటించారు. క్యాంపు కార్యాలయంలో సీఎం, మంత్రిని కలిసిన చరణి శుక్రవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లను చరణి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి లోకేష్ పుష్ప గుచ్ఛం అందించి ఆమెకు...