రహదారులపై వరి ధాన్యం అరబెట్టడం ప్రమాదకరం : ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, సూచన

మెదక్ జిల్లా, నవంబర్ 7, డైనమిక్ రహదారులపై వరి ధాన్యం అరబెట్టడం వల్ల ప్రజల ప్రాణ భద్రతకు ముప్పు ఏర్పడుతోందని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు రైతులకు సూచించారు. కొంతమంది రైతులు సౌలభ్యం కోసం రహదారులపైనే ధాన్యం ఆరబెట్టడం వల్ల వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, ఇరుకుగా మారిన రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాత్రివేళల్లో మరింత ప్రమాదం రాత్రి సమయంలో రైతులు ధాన్యం చుట్టూ రాళ్లు పెట్టడం, బ్లాక్ పాలిథిన్ కవర్లతో కప్పడం వలన వాహనదారులు అవి గమనించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన...