భారత గడ్డపై సీపీఐకు వందేళ్ల చరిత్ర – వందేళ్ల ఉత్సవాలను జయప్రదం చేయండి: పోకల వెంకటేశ్వర్లు
గరిడేపల్లి, నవంబర్ 7, డైనమిక్ భారత గడ్డపై సీపీఐ పార్టీకి వందేళ్ల సుదీర్ఘ పోరాట చరిత్ర ఉందని, ఆ పార్టీ వందేళ్ల ఉత్సవాల భాగంగా ఈ నెల 20వ తేదీన గరిడేపల్లి మండల కేంద్రానికి రానున్న రాష్ట్ర బస్సు జాతాను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా గరిడేపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో జాతాకు సంబంధించిన కరపత్రికలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ—1925 డిసెంబర్ 26న భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని మొట్టమొదటగా డిమాండ్ చేసిన పార్టీ సీపీఐ అని, ఆ స్వాతంత్ర్య యాత్రలోనూ, తరువాత ప్రజా ఉద్యమాల్లోనూ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.స్వాతంత్ర్యం...